హైదరాబాద్‌లో అమేజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం

హైదరాబాద్‌లో అమేజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్ తమ అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. ఇది భారత దేశంలోనే కాదు… యునైటెడ్ స్టేట్స్ బయట అమేజాన్ కంపెనీ నిర్మించిన అతిపెద్ద భవనంగా రికార్డులకెక్కింది. వరల్డ్ లార్జెస్ట్ అమేజాన్ క్యాంపస్ బిల్డింగ్ ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ ప్రారంభించారు. కార్యక్రమంలో అమేజాన్ ప్రతినిధులతో పాటు… రాష్ట్ర ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా పాల్గొన్నారు. అమేజాన్ లార్జెస్ట్ బిల్డింగ్ లాంచ్ తో.. దిగ్గజ కంపెనీల కార్పొరేట్ ఆఫీస్ లకు హైదరాబాద్ కేరాఫ్ గా మారినట్టయింది.

ఐటీ రంగంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ మారిందని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఉప్పల్, నాచారంతో పాటు.. సిటీ నలుమూలలా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ తో 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతులు వస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికే 3 అమేజాన్ బిజినెస్ సెంటర్లు హైదరాబాద్ లో ఉన్నాయనీ.. అమేజాన్ డేటా సెంటర్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటుచేయాలని ఆయన కోరారు.