రిలీజ్ అయిన 11 నెలల తర్వాత ఓటీటీలోకి జర హట్కే జర బచ్కే చిత్రం

రిలీజ్ అయిన 11 నెలల తర్వాత ఓటీటీలోకి జర హట్కే జర బచ్కే చిత్రం

విక్కీ కౌశల్‌‌‌‌‌‌‌‌, సారా అలీఖాన్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌లో విడుదలై సూపర్ హిట్ అయింది. సాధారణంగా సినిమా విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుండగా.. ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి పదకొండు నెలల సమయం పట్టింది. 

ఈనెల 17 నుంచి జియో సినిమాలో ఇది స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు జియో సినిమా ప్రకటించింది. కొత్తగా పెళ్లైన ఓ మధ్యతరగతి జంట సొంతింటి కల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.