వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ ‘పాతికేళ్ల అబ్బాయి ఇంత ప్యాషన్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఈ సినిమాలో నిజాయితీ ఉంది. హార్ట్‌ఫుల్‌గా చెప్పిన ఈ కథ ఓటీటీలో మరింత పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
దర్శకులు వేణు ఉడుగుల, సాయిలు పాల్గొని చాలా కొత్తదనంతో ఉన్న సినిమా ఇదని చెప్పారు. ‘థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం ఈటీవీ విన్‌లో కూడా మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని హీరో హీరోయిన్ అన్నారు.
ఓటీటీ ద్వారా ఇంకా ఎక్కువమందికి ఈ చిత్రం చేరువవుతుందని డైరెక్టర్ వినయ్ రత్నం చెప్పాడు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
