వాళ్లను దేశం నుంచి పంపేయండి..ముస్లిం ప్రతినిధులపై ట్రంప్ ఫైర్

వాళ్లను దేశం నుంచి పంపేయండి..ముస్లిం ప్రతినిధులపై ట్రంప్ ఫైర్
  • వారు పిచ్చోళ్లు, మానసిక రోగులు అంటూ కామెంట్స్ 

వాషింగ్టన్: స్టేట్  ఆఫ్  ది యూనియన్  ప్రసంగంలో తనకు అడ్డు తగిలిన ప్రతినిధుల సభ సభ్యులు ఇల్హన్  ఒమర్ (మిన్నెసోటా), రషీదా తలైబ్ (మిచిగన్)పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ‘‘ఆ ముస్లిం ప్రతినిధులు పిచ్చివారు, మానసిక రోగులు. మెంటల్  హాస్పిటల్ లో ట్రీట్మెంట్  ఇవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపాలి” అని తన  ట్రూత్ సోషల్ లో ఆయన విమర్శించారు. 

మంగళవారం స్టేట్ ఆఫ్ ది యూనియన్  ప్రసంగంలో ట్రంప్  మాట్లాడుతుండగా...  సోమాలి అమెరికన్  ఇల్హన్, పాలస్తీనియన్  అమెరికన్  రషీదా  అడ్డు తగిలారు. ట్రంప్  ఇమిగ్రేషన్  విధానాలను విమర్శించారు. ‘‘మీరు (ట్రంప్) మీ ఇమిగ్రేషన్  విధానాలతో అమెరికన్లను చంపుతున్నారు. నువ్వొక లయర్ వి” అంటూ కామెంట్లు చేశారు. దీంతో వారికి పొగరు ఎక్కువైందని, వారిని సాధ్యమైనంత త్వరగా వారి సొంత దేశాలకు పంపాలని ట్రంప్  కామెంట్  చేశారు.