జనగామ అర్బన్, వెలుగు: 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశానికి మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్వో కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపికైన వారికి జిల్లా స్థాయిలో వచ్చే నెల 28న జనగామ జిల్లాలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు.
ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు https://tgss.telangana.gov.in/ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఎంఈవోలను సంప్రదించాలని సూచించారు.
