ఖర్చు ₹ 450.. రిజల్ట్ అర్ధగంటలో యాంటీజెన్ టెస్ట్ లు బెటర్

ఖర్చు ₹ 450.. రిజల్ట్ అర్ధగంటలో యాంటీజెన్ టెస్ట్ లు బెటర్

కరోనా టెస్ట్.. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. లక్షణాలు కొంచెం కనిపించి నా చాలు.. కరోనా భయంతో జనాలు టెస్టిం గ్ సెంటర్ కు  క్యూ కట్టేస్తున్నారు. కానీ, ఆ టెస్ట్ లు చాలా మందికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం మహమ్మారి కరోనా ను గుర్తించేందుకు ఎక్కువగా చేస్తున్న టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు. ఆ టెస్టుల కోసం జనాలకు తిప్పలు తప్పడం లేదు. శాంపిల్ ఇచ్చినా రిజల్ట్స్ రావడానికి నాలుగు రోజులదాకా పడుతోంది. అంతేకాదు, దీనికి ఖర్చు కూడా రూ.3 వేల దాకా అవుతోంది. కానీ, ఈమధ్యే ఆ బాధలను తప్పించేలా, జనాల్లోఓ చిన్న ఆశను పెంచేలా అరగంటలోనే రిజల్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాల్సిందేనని ఐసీఎంఆర్ ముందే చెప్పింది. ఇప్పటికే టెస్టులు తక్కువగా చేస్తున్న సర్కారు.. ఈ టెస్టులనూ తక్కువే చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం మన దగ్గర గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని దవాఖాన్లలో మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను ప్రారంభించారు. ఒక్కో ప్రైమరీ హెల్ప్ సెంటర్ కు 225 కిట్ల చొప్పున పంపించారు. దీంతో ఒక్కోచోట రోజుకు 25 నుంచి 40 మందికి మాత్రమే యాంటీ జెన్ టెస్ట్ లు చేస్తున్నా రు. ఈ టెస్టులు మరింత పెంచితే ఇప్పుడున్న కరోనా వైరస్ వ్యాప్తి మరింత జరగకుండా కట్టడి చేసే వీలుంటుందని జనం కోరుతున్నారు. రాష్ర్టం లో 33 జిల్లాలు ఉండగా, ఇప్పటికీ కనీసం పది జిల్లాల్లో కూడా కరోనా ల్యాబులు లేవు. ఇలాంటి సమయంలో అన్నిచోట్లా యాంటీజెన్ టెస్టులు అందుబాటులోకి తెస్తే మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టెస్టులు ఎక్కువ చేయడం వల్ల కరోనా సోకిన వారిని కట్టడి చేసే వీలుంటుందని, దీంతో వైరస్ ను కంట్రోల్ చేయోచ్చని చెబుతున్నారు.

ఈ బాధలు తప్పుతయ్

ప్రస్తుతం ఆర్టీపీ సీఆర్ టెస్టు రిజల్ట్ రావడానికి నాలుగైదు రోజులు పడుతోంది. ఈ 4 రోజుల్లో పేషెంట్ ఆరోగ్యం క్షీణించడంతోపాటు, ఇంట్లో వాళ్లకూ వైరస్  అంటుతోంది. కరోనా లక్షణాలు ఉన్నాయని హాస్పిటళ్లల్లో అడ్మిట్ చేసుకుపోతుండడంతో బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. టెస్టులను అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకొస్తే, జనాలకు ఇలాంటి కష్టాలు తప్పుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి, పేషెంట్ల ఇబ్బందు లను దృష్టిలో  పెట్టుకునే అన్నిప్రభుత్వ దవాఖాన్లలో టెస్టులు చేసుకునేందుకు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. మన సర్కార్ మా త్రం ఈ టెస్టులనూ తక్కువగానే చేస్తుండడంతో విమర్శలు వస్తున్నయి

ప్రైవేటులో కాసుల కక్కుర్తి

నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ లిబ్రేషన్ లేబొరేటరీస్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్  ప్రొవైడర్స్ అక్రెడిటే షన్ ఉన్న ప్రైవేటు ల్యాబులు, ప్రైవేటు హాస్పిటళ్లల్  ర్యాపిడ్యాంటీజెన్ టెస్టులు చేసుకోవడానికి గత నెలలోనే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఆ అక్రెడిటేషన్ ఉన్న ల్యాబులు, హాస్పిటల్లు మన దగ్గ ర వందల్లోఉన్నయి. ఇప్పటివరకూ ఒక్క సంస్థకూడా యాంటీ జెన్ టెస్ట్ లు స్టార్ట్ చే యలేదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు  ప్రైవేటు ల్యాబ్లు రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు రేటు ఫిక్స్ చేసుకున్నాయి. దీంతో పోలిస్తే ర్యాపిండ్ యాంటిజెన్ టెస్ట్ ఖరీదు తక్కువ. దీని ఖరీదు జస్ట్ రూ.450. దీంతో తమకేం లాభం రాదన్న ఉద్దే శంతో కాసుల కక్కుర్తి తోనే ప్రైవేటు ల్యాబ్ లు వీటి జోలికి వెళటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాభాలు తగ్గిపోతాయనే దురాలోచనతోనే యాంటీజెన్ టెస్టులు చేసేందుకు ఒక్క ప్రైవేటు ల్యాబ్ కూడా ముందుకు రావట్లేదని అధికారులు అంటున్నారు.

ఎట్లచేస్తరు?

యాంటీ జెన్ టెస్టునూ  ఆర్టీపీసీఆర్ లాగే చేస్తారు. ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్ ) స్వాబ్ తో శాంపిల్ తీసుకుంటా రు . శాంపి ల్ ఉన్న స్వాబ్ ను వైరస్ ను ఇన్ యాక్టీవ్ చే   ఓ లిక్విడ్ లో వేస్తారు. కాసేపు దానిని షేక్ చేసి ఆ లిక్విడ్ డ్రాప్ ను  ఆర్టిఫిషియల్ యాంటీబాడీలుండే టెస్టింగ్ కిట్ లో వేస్తారు. అరగంటలోనే కరోనా ఉన్నది లేనిదీ ఈ టెస్టులో తెలిసిపోతుంది. టెస్ట్ ల ద్వారా  వైరస్ ప్రొటీన్ ను  గుర్తిస్తారు. అది కూడా కరోనా వైరస్లో కీలకమైన ‘స్పైక్(ఎస్) ప్రొటీన్’ లక్ష్యంగానే ఈ టెస్ట్ చేస్తారు.  శాంపి ల్ లిక్విడ్ వేయగానే ఆ ఆర్టిఫిర్టి షియల్ యాంటీ బాడీలు.. వైరస్ ప్రొటీన్ కు  అతుక్కుపోతాయి. దీంతో టెస్టింగ్ కిట్ లో  ఉండే ‘సీ (కంట్రోల్ ), టీ (టెస్ట్)’ లైన్ల రంగు మారుతాయి. ఆ రెండు లైన్లు రంగులోకి మారాయంటే వైరస్ ఉన్నట్టులెక్క. అలాకాకుండా సీ లైన్ రంగు మారకుండా, టీ లై న్ ఒక్కటే రంగొచ్చినా పాజిటివ్ అన్నట్టే. ఒకవేళ సీ లైన్ మీద రంగు వచ్చి, టీ మీద రాకపోతే.. నెగెటివ్ అన్నట్టు. ఒక వేళ లక్షణాలుండీ ఈ టెస్ట్లో నెగెటివ్ వస్తే.. మళ్లీ తప్పకుండా ఆర్టీపీర్టీ సీఆర్ టెస్ట్ చేయాల్సిందే. కరోనా సోకిన తర్వాత లక్షణాల్లేని వాళ్లంల్లో  పది రోజులు, లక్షణాలున్న వాళ్లంల్లో 14 రోజుల పాటు ఒంట్లో వైరస్ ప్రొటీన్ ఆన వాళ్లుంటాయి.యాంటీజెన్ టెస్టులు చేయడా నికి ఆర్టీపీసీఆర్ తరహాలో  పెద్దపెద్ద ల్యాబులు అవసరం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పిటల్స్ వరకూ ఎక్కడైనా ఈ టెస్టులను చేయొచ్చు. అందుకు ఐసీఎంఆ ర్ పర్మిషన్ కూడా ఇచ్చింది.