ఫెడ్ పాలసీపై ఫోకస్‌‌

ఫెడ్ పాలసీపై ఫోకస్‌‌
  • బుధవారం మార్కెట్‌‌కు సెలవు

ముంబై: యూఎస్‌‌ ఫెడ్ పాలసీ మీటింగ్‌‌, కంపెనీల  రిజల్ట్స్ ఈ వారం మార్కెట్‌‌ డైరెక్షన్‌‌ను నిర్ణయించనున్నాయి. గ్లోబల్‌‌ అంశాలతో పాటు విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల కదలికలు,  క్రూడాయిల్ ధరలు, డాలర్ రూపాయి ట్రెండ్‌‌ను గమనించాలని ట్రేడర్లకు ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. మహారాష్ట్ర డే సందర్భంగా ఇండియన్ మార్కెట్లకు బుధవారం సెలవు. క్యూ4 రిజల్ట్స్‌‌ బట్టి నిర్ధిష్టమైన షేర్లు ఎక్కువగా కదలొచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌‌మార్ట్‌‌ ఎనలిస్ట్‌‌ సంతోష్ మీనా అన్నారు. 

మే  ప్రారంభంలో ఆటో సేల్స్ డేటా వెలువడనుందని, లోక్‌‌ సభ ఎన్నికల్లో తర్వాతి ఫేజ్‌‌ కీలకమని చెప్పారు. గ్లోబల్‌‌గా చూస్తే  యూఎస్ ఫెడ్ మీటింగ్ మే 1న మొదలుకానుందని అన్నారు. చైనా, యూఎస్ ఎకనామిక్ డేటాపై ఫోకస్ పెట్టాలని అన్నారు. ఈ వారం టాటా కెమికల్స్‌‌, సెంట్రల్‌‌ బ్యాంక్‌‌, ఐఓసీ, అదానీ పవర్‌‌‌‌, అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌, అదానీ గ్రీన్ ఎనర్జీ రిజల్ట్స్‌ ఉన్నాయి.