వంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

వంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్ లో చేరిన బీఆర్​ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు
  • వంశీకృష్ణకు భీందళ్, మాల సంఘం లీడర్ల మద్దతు

కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వంశీకృష్ణను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం  మంచిర్యాలలో ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సమక్షంలో మందమర్రి మండలం గుడిపెల్లి- వెంకటాపూర్ మాజీ సర్పంచ్ కుమ్మరి తిరుపతి, వార్డ్ మెంబర్ దాడి తిరుపతి, నేతకానీ సంఘం లీడర్ వెంకటస్వామితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్​లో  చేరారు. సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ లీడర్లు కొట్టె సంపత్ కుమార్, శీలం చిన్నయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు నీలయ్య, మరాఠి శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

వంశీకృష్ణకు సంఘాల మద్దతు

రామగుండం కార్పొరేషన్ జాతీయ మాల మహానాడు, భీందళ్ లీడర్లు వివేక్ వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కలిశారు. ఎన్నికల్లో వంశీకృష్ణకు తమ సంఘాల మద్దతును ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ 50వ డివిజన్ మాల సంఘం మద్దతు ఉంటుందని, మాల కుల సంఘం భవనాలు నిర్మాణానికి సహకరించాలని కోరారు. వారిని కలిసినవారిలో రామగుండం నియోజకవర్గం మాల మహానాడు ప్రెసిడెంట్ మధు, కార్పొరేషన్ ప్రెసిడెంట్ పిట్టల వెంకటి, జనరల్ సెక్రటరీ నంది నగేశ్, కొండక్ కుమార్, నుకాల మోహన్, నల్ల శంకర్ ఉన్నారు. హైదరాబాద్ భీం దళ్ ప్రెసిడెంట్ శివాజీ తీగుళ్ల, వైస్ ప్రెసిడెంట్ తాడికొండ వెంకటేశ్, సంపత్, శ్రీనివాస్, కార్యకర్తలు కలిసి మద్దతు పలికారు.

వివేక్​ ఇంటికి దీపాదాస్​ మున్షీ

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసానికి ఆదివారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ వచ్చారు. ఈ సందర్భంగా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు వివేక్, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ, స్టేట్ లీడర్ దుర్గం నరేశ్​తో కలిసి ఆమె బ్రేక్ ఫాస్ట్ చేశారు. వంశీకృష్ణ గెలుపు కోసం ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే వివేక్ తోపాటు దీపాదాస్ మున్షీని కలిసిన ఆటో డ్రైవర్లు తమకు ప్రతి నెలా రూ.12 వేల భృతి ఇచ్చేందుకు చొరవ చూపాలని వారికి వినతిపత్రం అందజేశారు. ఆటో యూనియన్ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్​చార్జ్ పొట్ట మధుకర్, మందమర్రి ఆటో యూనియన్ అధ్యక్షులు మేడిరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రిని ప్రారంభించిన చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మల్లికార్జున పిల్లల ఆస్పత్రిని ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, పేదలకు మరింత సహాయం చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు.

ప్రేమ్​సాగర్​రావు దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు-సురేఖ దంపతుల పెండ్లి రోజును పురస్కరించుకొని వారికి దీపాదాస్​ మున్షీతోపాటు ఎమ్మెల్యేలు వివేక్​, వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్​ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.  శాలువాలతో సత్కరించారు.