ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిన నటి ప్రియమణి. డస్కీ బ్యూటీగా కుర్రాళ్లకు సెగలు రేపిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పరుసగా అవకాశాలు అందుకుంటుంది.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'ఎస్ సరస్వతి' మూవీతో ప్రేక్షకులను పలకరించింది ఈభామ. వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
బికినీ తప్పుకాదు..
కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రియమణి. 'బికినీ ధరించడం తప్పుకాదు. స్టోరీకి తగినట్లుగా, ఆ పరిస్థితులకు అనుగుణమైన దుస్తులు వేసుకోవాల్సిందే. స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటే అప్పుడు చీర, జీన్స్ వంటివి ధరించలేం కదా. ద్రోణి సినిమాలో బికినీ సీన్ చేయడానికి కాస్త భయ పడ్డాను అని చెప్పింది. అయితే ఆ చిత్ర దర్శకుడు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని తెలిపింది.
విపరీతంగా ట్రోలింగ్స్
అప్పట్లో 'టషన్' సినిమాలో కరీనా కపూర్ బికినీ ధరించిన సీన్ వైరల్ కావడంతో తనను కూడా అలాగే డిఫరెంట్ గా చూపి స్తానని చెప్పాడు అని చెప్పుకొచ్చింది ప్రియమణి. అప్పటి వరకు నేను ఏ సి నిమాలోనూ బికినీ, స్విమ్ సూట్ లాంటివి వేసుకోలేదు. దాంతో ఒకసారి ట్రై చేద్దామని ఒకే చెప్పా ఈ సీన్ తర్వాత నాపై చాలా కామెంట్స్ వచ్చాయి. విపరీతంగా ట్రోలింగ్స్ చేశారని తెలిపింది.
వరుస సినిమాలతో..
అప్పటి వరకు సాధారణ పాత్రలు చేసిన నన్ను.. ప్రేక్షకులు కొత్తగా చూడటంతోనే ఇలా జరిగింది ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్ చేస్తే అలాంటి డ్రెస్ వేసుకోక తప్పదు. అలాగని మన కంఫర్ట్ ని పక్కన పెట్టకూడదు , ఇప్పుడు బికినీ వేసుకోమంటే మాత్రం చేయను అంటూ తేల్చి చెప్పేసింది. ఇక ప్రస్తుతం ప్రియమణి నటించిన విజయ్ 'జన వాయగన్ ' రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే అది కోర్టు కేసులు, సెన్సార్ వివాదంతో వాయిదా పడుతోంది. అంతే కాకుండా జీడీఎస్, గోల్మాల్ సినిమాల్లో ప్రియమణి నటిస్తోంది..
