అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. లొంగిపోవాలని వార్నింగ్ ఇచ్చినా లొంగకపోవడంతో ఇరాన్ పై అమెరికా మరిన్ని దాడులకు సిద్దమవుతోంది. అధునాతన, శక్తివంతమైన ఫైటర్ జెట్లను ఇరాన్ చుట్టూ మోహరిస్తోంది. ఈ సంక్షోభంలో బ్రిటన్ కూడా తమకు మద్దతు ప్రకటించడం, ఎయిర్ బేస్ లను వాడుకునేందుకు అనుమతించడంతో తాజాగా అమెరికా B1 బాంబర్ ను బ్రిటన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ చేసింది. ఈ బాంబర్ రంగంలోకి దిగితే ఇంతకు ముందెన్నడూ చూడని విధ్వంసం తప్పదని ఆర్మీ నిపుణులు అంటున్నారు.
ఇరాన్ పై అమెరికా తీవ్ర దాడులకు పాల్పడుతుందని వార్తలు వస్తున్న క్రమంలో ఈస్ట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత శక్తివంతమైన అమెరికా బాంబర్ విమానం B-1 లాన్సర్ బ్రిటన్‌లోని గ్లౌసెస్టర్‌షైర్ ప్రాంతంలోని RAF ఎయిర్‌బేస్‌లో దిగింది. అమెరికా, ఇరాన్ ఘర్షణ ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఇరాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ట్రంప్ హెచ్చరికల మధ్య ఓ అమెరికన్ బాంబర్ బ్రిటన్‌లో దిగింది. అత్యంత శక్తివంతమైన, వేగంగా శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా దాడులు చేసే B-1 లాన్సర్ జెట్ ఫైటర్..బ్రిటన్ లోని ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయింది. ఇక ఇరాన్ సైనిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ కు మిగిలింది.
UK స్థావరాల నుంచి ఇరానియన్ క్షిపణి స్థావరాలపై అమెరికా ఖచ్చితమైన వ్యూహాత్మక దాడులకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల మధ్య ఇరాన్ పై దాడులకు తమ ఎయిర్ బేస్ లను వినియోగించుకోవచ్చని యూకె ప్రధాని కైర్ స్టార్మర్ అనుమతిచ్చిన తర్వాత శుక్రవారం (మార్చి6)సాయంత్రం B-1 లాన్సర్ యూకే ఎయిర్ బేస్ లో దిగింది. రాబోయే రోజుల్లో బ్రిటన్ కు మరిన్ని జెట్ ఫైటర్లు వచ్చే అవకాశం ఉంది.
ఈ కీలక పరిణామంతో బ్రిటన్ పరోక్షంగా అమెరికా, ఇరాన్ ఘర్షణల్లో పాల్గొంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై బ్రిటన్ ప్రతిస్పందన, సైప్రస్ రక్షణపై మిత్రదేశాలు బ్రిటన్‌ను విమర్శించిన తర్వాత ఇది జరిగింది. ఈ వారం ప్రారంభంలో సైప్రస్ స్థావరాన్ని ఇరాన్ డ్రోన్ దాడి చేసిన విషయం తెలిసిందే.
ఏంటీ బీ1 బాంబర్ స్పెషాలిటీ?..
రాక్ వెల్ బీ1 లాన్సర్ అత్యంత శక్తివంతమైన అమెరికా వైమానిక దళానికి చెందిన సూపర్ సోనిక్ బాంబర్.. ఇది గంటలకు 1500 కిలోమీటర్ల వేగంలో ఖచ్చితమైన లక్ష్యాలను చేధించగలదు. దాదాను 37 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. 1985 నుంచి సేవలో ఉన్న ఈ ఫైటర్ జెట్ వేగంగా ఖచ్చితమైన దాడులు చేయడంలో ఫేమస్. రాక్ వెల్ బీ1 బాంబర్ గనక రంగంలోకి దిగితే ఇరాన్ విధ్వంసం తప్పదని ఆర్మీ నిపుణులు చెబుతున్నారు.
