పల్లె వైద్యానికి 740 కోట్లు విడుదల..తెలంగాణలో 1,569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం

పల్లె వైద్యానికి 740 కోట్లు విడుదల..తెలంగాణలో 1,569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం
  • గ్రామాల్లోనే ఉచితంగా డయాగ్నోస్టిక్ టెస్టులు

  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు భారీగా రూ.740 కోట్ల నిధులను మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఈ ఫండ్స్‌‌‌‌ను విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. ఈ కేటాయింపులతో రాష్ట్రవ్యాప్తంగా 1,569 కొత్త సబ్ సెంటర్ల బిల్డింగ్స్‌‌‌‌ను నిర్మించనున్నారు.

అత్యాధునిక మౌలిక వసతులతో ఈ భవనాలను నిర్మించి, విలేజ్ లెవెల్‌‌‌‌లో మెడికల్ సర్వీసెస్‌‌‌‌ను మరింత చేరువ చేయాలని సర్కారు నిర్ణయించింది. సాధారణ మెడికల్ టెస్ట్‌‌‌‌ల కోసం ఇకపై గ్రామస్తులు వేరే సిటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, లోకల్‌‌‌‌గానే ఫ్రీగా డయాగ్నోస్టిక్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమరీ లెవెల్‌‌‌‌లోనే వ్యాధులను గుర్తించి సత్వర ట్రీట్‌‌‌‌మెంట్ అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.