హైదరాబాద్, వెలుగు: మాన్సూన్ రెగ్గట్టా నేషనల్ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు లావేటి ధరణి – వడ్ల మల్లేష్, కొమరవెల్లి దీక్షిత సూపర్ పెర్ఫామె న్స్‌తో గోల్డ్ మెడల్స్ దాదాపు ఖాయం చేసు కున్నారు. శుక్రవారం జరిగిన అండర్ 19 ఇంటర్నేషనల్ క్లాస్ కేటగిరీలో ధరణి– మల్లేష్ జంట సత్తా చాటింది. మరో మూడు రేసులు మిగిలుండగా10 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
అండర్ 15 ఆప్టిమిస్ట్ క్లాస్ గర్ల్స్ కేటగిరీలో దీక్షిత 40 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ ముంగిట నిలిచింది. బాయ్స్‌లో మధ్యప్రదేశ్ ఎన్‌ఎస్‌ఎస్ కు చెందిన ఏకలవ్య బాతం టాప్ ప్లేస్‌లో నిలిచాడు. మరో రెండు రోజుల్లో చివరి మూడు రేసులు జరగనున్నాయి.
