హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్' (శక్తి) పరిధిలోని ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగానికి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 'సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్', తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) పెట్టుబడుల పథకం కింద ఈ నిధులను ఖర్చు చేసేందుకు 'డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్'కు అనుమతి మంజూరు చేశారు. విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే విద్యార్థులు, యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
