ఏరోస్పేస్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌కు అడ్డాగా తెలంగాణ.. 2030 నాటికి సాధిస్తాం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి

ఏరోస్పేస్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌కు అడ్డాగా తెలంగాణ.. 2030 నాటికి సాధిస్తాం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ 2030 నాటికి  ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌–డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ రంగాలకు హబ్‌‌‌‌‌‌‌‌గా  ఎదుగుతుందని  మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.  హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన “ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ స్పార్క్‌‌‌‌‌‌‌‌ 3.0 - ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌” సదస్సులో ఆయన పాల్గొన్నారు.   రాష్ట్ర పారిశ్రామిక విధానంలో ఈ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. “ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ సిందూర్”తో  స్వదేశీ రక్షణ సామర్ధ్యం గురించి ప్రపంచానికి తెలిసిందని  డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌  సతీష్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ అక్విజిషన్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఇటీవల రూ.3.5 లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందని, ఇది భారత రక్షణ ఆధునికీకరణలో అతిపెద్ద నిర్ణయమని ఆయన వివరించారు.