తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2026 రాసే అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
మొదటి సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు జరగనుండగా... రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
►ALSO READ | NCLలో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలు: ఐటీఐ, డిప్లొమా అర్హత ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!
అభ్యర్థులు తమ పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ అయిన https://schooledu.telangana.gov.in ను సందర్శించవచ్చని టీజీటెట్ (TGTET) కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ పూర్తి వివరాలను చెక్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
