V6 News

జేఈఈ మెయిన్ ఫలితాల్లో మెరిసిన తెలుగు విద్యార్థులు

జేఈఈ మెయిన్ ఫలితాల్లో మెరిసిన తెలుగు విద్యార్థులు
  • తెలంగాణ, ఏపీ నుంచి ఐదుగురు చొప్పున వంద పర్సంటైల్
  • దేశవ్యాప్తంగా 24 మంది స్టూడెంట్లకు ఫుల్ స్కోర్

హైదరాబాద్, వెలుగు : జేఈఈ మెయిన్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది స్టూడెం స్కోర్ చేయగా, వారిలో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఆ పది మందిలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఏపీ నుంచి మరో ఐదుగురు ఉన్నారు. సోమవారం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్ -2 స్కోర్ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఫలితాలను జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో పెట్టారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ గత నెల 25 నుంచి 30 వరకు జరిగింది. దేశవ్యాప్తం గా జేఈఈ మెయిన్ కు 10,26,799 మంది రిజిస్టర్ చేసుకోగా 9,05,590 మంది ఎగ్జామ్ కు హాజరయ్యారు. సోమవారం వెలువడిన ఫలి తాల్లో దేశవ్యాప్తంగా 24 మంది వంద పర్సం టైల్ సాధించారు. తెలంగాణ నుంచి రూపేశ్ బియానీ, ధీరజ్ కోరుకొండ, జాస్తి యశ్వంత్ వీవీఎస్, బుస శివనాగ వెంకట ఆదిత్య, పాధ్యాయ ఉండగా, ఏపీ నుంచి పొలిశెట్టి కార్తికేయ, రవి కిశోర్, హిమవంశీ, కొయ్యాన సుహాస్, పల్లి జలజాక్షి ఉన్నారు. రాజస్థాన్ నుంచి నలుగురు, యూపీ నుంచి ఇద్దరు, అసోం, బీహార్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఒకరు చొప్పున వంద పర్సంటైల్ స్కోర్ సాధించారు. ఇక మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినం దుకు ఐదుగురు క్యాండిడేట్ల ఫలితాలను అధికా రులు విత్ హౌల్డ్ చేశారు.