అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ సీజన్–7లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్30–-24తో గుజరాత్ ఫార్చున్జెయింట్స్పై నెగ్గి ఈసీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన సిద్దార్థ్ దేశాయ్7 రైడింగ్ పాయింట్లతో స్థాయి తగ్గ ప్రదర్శన కనబర్చగా.. స్టార్ ఢిఫెండర్విశాల్ భరద్వాజ్7 ట్యాకిల్ పాయింట్లతో రాణించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన టైటాన్స్.. ఫస్టాఫ్ ముగిసే సరికి 17–-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. టై మ్యాచ్ అనుభవం దృష్ట్యా తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా ఆడిన టైటాన్స్ చివర్లోనూ జోరు చూపెట్టి తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించింది. గుజరాత్ టీమ్‌లో రోహిత్ గులియా 5 రైడ్ పాయింట్లు, పర్వేశ్ 7 ట్యాకిల్ పాయింట్లతో రాణించారు.
హర్యానా జోరు..
హోరాహోరిగా సాగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 33–30తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. హర్యానాలో వికాస్కందోలా 11 రైడ్ పాయింట్లతో సూపర్–10 సాధించగా.. ఢిఫెండర్ వికాస్ కాలే 6 ట్యాకిల్పాయింట్లతో రాణించాడు. బెంగళూరు కెప్టెన్రోహిత్కుమార్ (10 రైడింగ్,2 ట్యాకిల్) పాయింట్లతో చెలరేగినా… డిఫెన్స్ అనుకున్న స్థాయిలో అతనికి సహకరించలేదు.

