కీసర, వెలుగు : కీసరగుట్ట ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ నాగలింగం శర్మ తెలిపారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఈ దీపోత్సవంలో పాల్గొనే 200 మంది మహిళలకు పసుపు, కుంకుమ కిట్టు అందజేస్తామన్నారు. రంగంపేట, మెదక్ జిల్లా పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ప్రవచనము కార్తీక వైభవం, శివానందలహరి ఉంటుందన్నారు.
