మృగశిర కార్తె రోజు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది టన్నుల చేపలు మృతి..

మృగశిర కార్తె రోజు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది టన్నుల చేపలు మృతి..

మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రజల విశ్వాసం కారణంగా సోమవారం ( జూన్ 8 ) చేపలకు భారీ డిమాండ్ నెలకొంది. అయితే... మృగశిర కార్తె రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జూలూరుపాడు మండలం భోజ్యాతండా దండ్యాల చెరువులో దగ్గర ఎండల కారణంగా చెరువులో నీటి నిలువ తగ్గి ఉక్కపోతతో సుమారు పది టన్నుల చేపలు మృతి చెందాయి.

మృగశిర కార్తె రోజున చేపల అమ్మకాలతో ఆదాయం వస్తుందని అనుకుంటే... పది టన్నుల చేపలు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు మత్స్యకారులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కరీంనగర్ లో చేపలకు భారీ డిమాండ్..

మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలోని అలుగునూర్ వద్ద చేపలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రజల విశ్వాసం ఉంది.. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభ సమయంలో చేపలు తీసుకోవడం శరీరానికి శక్తినిస్తుందని పెద్దలు చెబుతుంటారు.

ALSO READ : పార్టీబలోపేతానికి బూత్స్థాయి వ్యవస్థ కీలకం

ఈ రోజు చేపలు తింటే జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవనే నమ్మకం ఉండడంతో నాన్ వెజ్ ప్రియులు ప్రత్యేకంగా చేపల వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల చేపలకు మంచి డిమాండ్ నెలకొంది. సాధారణ రోజుల కంటే మృగశిర కార్తె రోజున చేపల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు మత్స్యకారులు.