పార్టీబలోపేతానికి బూత్స్థాయి వ్యవస్థ కీలకం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

పార్టీబలోపేతానికి బూత్స్థాయి వ్యవస్థ కీలకం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

  కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్​స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్​బూత్​లెవల్​ఏజెంట్ల మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి హాజరైన షబ్బీర్​అలీ మాట్లాడుతూ... బూత్​స్థాయిలో పార్టీ కార్యకలాపాలు బలోపేతం కావాలంటే బీఎల్​ఏలు ప్రజలతో నిత్యం మమేకమై ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

జహీరాబాద్​ఎంపీ సురేశ్ షేట్కార్​మాట్లాడుతూ.. ఓటరు జాబితాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్​చంద్రకాంత్​రెడ్డి, టౌన్​ప్రెసిడెంట్ సందీప్, బీఏల్​ఏ మాస్టర్ ట్రైనర్ రోహిత్​రావు తదితరులు పాల్గొన్నారు

ఓటరు జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: ఓటరు జాబితాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలు అప్రమత్తంగా ఉండాలని,  ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికాకుండా చూడటంతో పాటు కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ దండే విఠల్ సూచించారు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం ఆదివారం కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్ లో నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి ఎమ్మెల్సీ  పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా సవరణలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని బీఎల్​వోలకు సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ పట్ల కాంగ్రెస్ నాయకులు అలెర్ట్ గా లేకుంటే నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమ్డే అనిల్, కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.