‘సర్’ స్పీడప్కు రాజకీయ పార్టీలు సహకరించాలి: మహబూబ్‌‌‌‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా

‘సర్’ స్పీడప్కు రాజకీయ పార్టీలు సహకరించాలి: మహబూబ్‌‌‌‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా

 మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా,  పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని మహబూబ్‌‌‌‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 79.62 శాతం డిజిటైజేషన్ పూర్తికాగా, ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వెరిఫికేషన్ ప్రక్రియ 86.55 శాతానికి చేరిందని వెల్లడించారు.

ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిందని, ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లను నేరుగా తొలగించకుండా ఈఆర్‌‌‌‌ఓ, ఏఈఆర్‌‌‌‌ఓలు క్షేత్రస్థాయి విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  85 ఏండ్లు దాటిన ఓటర్ల వివరాలను మళ్లీ ధ్రువీకరించాలని బీఎల్‌‌‌‌ఓలను ఆదేశించామని, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసిన వారు భౌతికంగా ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.