మిస్టర్ మోదీ.. అర్ధరాత్రి పనికిమాలిన వీడియోలతో విద్యార్థులను మోసం చేయకండి : రాహుల్ గాంధీ

మిస్టర్ మోదీ.. అర్ధరాత్రి పనికిమాలిన వీడియోలతో విద్యార్థులను మోసం చేయకండి : రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వీడియోలతో విద్యార్థులను మోసం చేయవద్దని మండిపడ్డారు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం (జులై 23) రాత్రి మోదీ విడుదల చేసిన వీడియోపై శుక్రవారం (జులై 24) ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్.

మిస్టర్ మోదీ.. విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల తెలివిని తక్కువ అంచనా వేయకండి. పనిమాలిన వీడియోలు మిడ్ నైట్ రిలీజ్ చేస్తూ వాళ్లను అవమానించకండి. 

విద్యార్థుల డిమాండ్స్ క్లియర్ గా ఉన్నాయి. 1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా,
2. విద్యార్థులను అత్యంత క్రూరంగా కొట్టిన పోలీసులను శిక్షించడం, 3. మీరు క్షమాపణ చెప్పడం... అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

పేపర్ లీకేజీకి పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా వచ్చే వారం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ రాత్రి వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మోదీ వీడియో విడుదల చేసిన గంటల వ్యవధిలోనే  రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్మం. 

ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ,  కఠినమైన శిక్షల ప్రతిపాదనలతో కొత్తం చట్టంపై శుక్రవారం కేబినెట్ చర్చిస్తుందని మోదీ వీడియోలో తెలిపారు. ఆ తర్వాత సోమవారం  (జులై 27)  ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.