మత్స్యశాఖ ఎన్నికల్లో ఉద్రిక్తత

మత్స్యశాఖ ఎన్నికల్లో ఉద్రిక్తత
  • ఎన్నికలు జరపాలని ఓ వర్గం.. వద్దని మరో వర్గం ఆందోళన

సూర్యాపేట జిల్లా కలకోవ గ్రామంలో జరిగిన మత్స్యశాఖ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఎన్నికలు జరపాలని ఓవర్గం..జరపొద్దని మరో వర్గం ఆందోళన చేశారు. కొందరు వ్యక్తులు ఎన్నికల అధికారుల కారుపై రాళ్లతో దాడికి యత్నించారు. అధికార పార్టీ అండతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఓ వర్గం నాయకులు. రెండు వర్గాల నాయకులు ఒకరిని ఒకరు తోసుకోవడంతో పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నించారు.

ప్రశాంతత కోసం ప్రయత్నించండి

గ్రామంలో ప్రశాంతత కోసం ప్రయత్నించండి అంటూ ఇరువర్గాల వారు పోలీసులు, అధికారులతో వాగ్వాదం చేశారు. ఎన్నికలు జరిపితే ఓ పనైపోతుందని.. ఓ వర్గం వాదించగా.. వద్దు.. మేం కోర్టు ద్వారా తేల్చుకునే వరకు ఓపిక పట్టమని ఇంకో వర్గం వారు వాదించారు. ఇరు వర్గాల వారిని బుజ్జగించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నించారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలను రప్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చేశారు.