పెండ్లికి తీసుకెళ్లలేదని టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

పెండ్లికి తీసుకెళ్లలేదని టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య
ఖానాపూర్, వెలుగు: తల్లిదండ్రులు పెండ్లికి తీసుకెళ్లలేదని టెన్త్​క్లాస్ స్టూడెంట్​ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జా పూర్ గ్రామానికి చెం దిన ఎస్.కె ఇమాం దంపతులతోపాటు ఇతర కుటుంబసభ్యులంతా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపకలా గ్రామంలో బంధువు పెండ్లి వేడుకలకు సోమవారం వెళ్లారు. కూతురు సమీరా(15) వస్తానని చెప్పినా వద్దని నచ్చజెప్పారు. రాత్రి తండ్రి ఇంటికి రాగా సమీరా ఇంట్లో ఉరేసుకుని కనిపించిం ది. సమీరా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకులంలో చదువుతోం ది.