అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ లో తన రెండో కారు మోడల్ వైఎల్ విడుదల చేసింది. ఆరు సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రీమియం ఎస్యూవీ ధర ను రూ.61.99 లక్షలుగా నిర్ణయించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్లకుపైగా మైలేజీ ఇస్తుంది. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో సర్వీస్ సెంటర్లు, బాడీ షాపుల నెట్వర్క్ విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో కొత్త కారు మోడల్ వైఎల్‌ను బుధవారం విడుదల చేసింది. కొత్త 6 సీటర్ వేరియెంట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారులో పలు ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. గతేడాది జూలైలో మార్కెట్‌లో వచ్చిన టెస్లా కంపెనీ తన కార్ల శ్రేణిని మరింత విస్తరిస్తోంది. మోడల్ వైఎల్ కారు ధర 66,324 డాలర్లు (దాదాపుగా రూ.62 లక్షలు) ఉండగా, గతంలో వచ్చిన వై మోడల్ కార్ల కన్నా వీల్ బేస్ మరింత ఎక్కువగా ఉంటుందని టెస్లా తెలిపింది. అయితే గతంలో టెస్లా భారత్‌లో లాంచ్ చేసిన కార్లకు స్పందన అంతంత మాత్రంగానే లభించగా, ఇప్పుడు మార్కెట్ పెంచాలని దృష్టితో ఈ కారు మోడల్‌ను ప్రవేశపెట్టింది.
టెస్లాకు చెందిన అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ వై కార్లలో మోడల్ వైఎల్ కారును అడ్వాన్స్డ్ ఫీచర్లతో అందిస్తున్నారు. ఇందులో ఎక్కువ వీల్ బేస్ ఉండడంతోపాటు హైఎండ్ వేరియెంట్‌ను తక్కువ ధరలో అందిస్తోంది. భారత వినియోగదారులు ఎక్కువగా పెద్ద సైజు, ప్రీమియం సదుపాయాలు కలిగిన కార్లపై ఆసక్తిని చూపిస్తున్న క్రమంలో టెస్లా ఈ కార్‌ను లాంచ్ చేసింది. టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్న కార్లకు ప్రస్తుతం భారత్‌లో డిమాండ్ ఉంది. ఆ విభాగం కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లా ఈ ఆర్ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

