టెట్ పేపర్ 1కు 90.62% హాజరు

టెట్ పేపర్ 1కు 90.62% హాజరు

టెట్ పరీక్షకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.  మొదటి పేపర్ కు మొత్తం 3,51,482 మంది అభ్యర్థులకుగానూ  3,18,506 మంది హాజరయ్యారు. దీంతో  90.62 శాతం హాజరు  నమోదైంది.  మరో 32,976 మంది టెట్ మొదటి పేపర్ కు గైర్హాజరయ్యారు.  ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 2,683 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఈసారి నుంచి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడీ కల్పించారు.  సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం ఈసారి పేపర్ -1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇచ్చారు.  ఈ కారణాలతో టెట్ కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.