నేడే (జూన్ 05) పీజీఈసెట్ ఫలితాలు

నేడే (జూన్ 05) పీజీఈసెట్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జేఎన్‌‌టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, జేఎన్‌‌టీయూ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్‌‌ కుమార్ రెడ్డి ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఫలితాలు, ర్యాంకు కార్డులను https://pgecet.tgche.ac.in వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.