బంజారాహిల్స్‌‌‌‌లోని టీజీఐసీసీసీలో టెక్నికల్‌‌‌‌ పోస్టులు

బంజారాహిల్స్‌‌‌‌లోని టీజీఐసీసీసీలో టెక్నికల్‌‌‌‌ పోస్టులు

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్ (టీజీఐసీసీసీ)లో పలు టెక్నికల్‌‌‌‌ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఆమోదిత సంస్థ అయిన ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (ఓటీఎస్‌‌‌‌ఐ) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అవుట్‌‌‌‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతిక విభాగంలో డేటాబేస్, నెట్‌‌‌‌వర్క్, సర్వర్‌‌‌‌, స్టోరేజ్‌‌‌‌అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఓటీఎస్‌‌‌‌ఐ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. అలాగే తమ రెజ్యూమ్‌‌‌‌ను career@otsi.co.in మెయిల్‌‌‌‌కు జూన్ 14లోపు పంపించాలని సూచించారు. అర్హతలు, ఇతర వివరాలకు పోర్టల్‌‌‌‌ను చూడాలన్నారు.