నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సికింద్రాబాద్​ పెరైడ్​ గ్రౌండ్​లో ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల్లో సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పారు. త్వరలో అన్నా రకాల జాబ్​ నోటిఫికేషన్లు విడుదలచేస్తామన్నారు.  ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ నిరంతరంగా ఉంటుందన్నారు.   ఈ నెలలోనే ( 2026 జూన్​) టీజీపీఎస్​సీ నోటిఫికేషన్లు వస్తాయంటూ..ఇంజినీరింగ్‌, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్‌, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు.  అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. 

ఇక ప్రతి నెలా  రెండు మూడు నోటిఫికేషన్లు వస్తాయనంన సీఎం.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.  ప్రస్తుతం వివిధ శాఖల్లో 3వేల 800 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతి లభిందన్నారు. జూన్​ 2,3 తేదీల్లో  ఫారెస్ట్​ డిపార్ట్​ మెంట్​, సివిల్​ ఇంజనీరింగ్​ పోస్టులు, విద్యుత్​ శాఖ, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న  డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీ, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు, రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం రేవంత్​ తెలిపారు.