జూన్ 8,9న చేప ప్రసాదం పంపిణీ... హైదరాబాద్ లో TGSRTC ప్రత్యేక బస్సులు..

జూన్ 8,9న చేప ప్రసాదం పంపిణీ... హైదరాబాద్ లో TGSRTC ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సోమవారం, మంగళవారం ( జూన్ 8, 9 ) చేప ప్రసాదం పంపిణీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ఏరియాల నుండి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది టీజీఎస్ఆర్టీసీ. జూన్ 8 నుండి ట్రాఫిక్ క్లియర్ అయ్యేంతవరకు 124 ప్రత్యేక బస్సు నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ.

సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, JBS, MGBS బస్ స్టాండ్ల నుంచి, దిల్‌సుఖ్‌నగర్, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, చార్మినార్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. అంతే కాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపింది.

గాంధీ భవన్, పబ్లిక్ గార్డెన్స్ వంటి కీలక జంక్షన్లలో ట్రాఫిక్ పర్యవేక్షణకు అధికారులను నియమించామని..రిసెప్షన్ కౌంటర్లు, జోనల్ కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచనున్నట్లు వెల్లడించారు అధికారులు. ప్రత్యేక బస్సు సేవలు సాధారణ ఛార్జీలతోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.