ఎంఎస్ఎంఈ లకు,వీధి వ్యాపారస్తులకు శుభవార్త : రూ .20 వేల కోట్ల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం

ఎంఎస్ఎంఈ లకు,వీధి వ్యాపారస్తులకు శుభవార్త : రూ .20 వేల కోట్ల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

2 లక్షల ఎంఎస్ఎంఈల యూనిట్లకు లబ్ధి చేకూర్చేలా రూ .20,000 కోట్ల  ప్యాకేజీకి కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. వీధి వ్యాపారులకు రూ .50 వేల కోట్ల ప్యాకేజీని కూడా ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ ప్యాకేజీ కింద, వీధి వ్యాపారస్తులు, కొబ్బరికాయలు మరియు సెలూన్ల నిర్వాహకులు తక్షణ రుణం కింద రూ .10,000 రుణం పొందవచ్చని,  ఈ పథకం వల్ల కనీసం 50 లక్షల మంది  లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు.

1) ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఎంఎస్‌ఎంఈలలో రూ.10లక్షల టర్నోవర్ కు రూ.25 లక్షల వరకు పెట్టుబడి, రూ.5కోట్ల టర్నోవర్ కు రూ.1 కోటి పెట్టుబడికి ఆమోదించింది.

2) చిన్న సంస్థలకు పెట్టుబడి పరిమితిని రూ .5 కోట్ల నుంచి రూ .10 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   టర్న్ ఓవర్ పరిమితిని రూ .2 కోట్ల నుంచి రూ .50 కోట్లకు పెంచింది.

3) మధ్యస్థ పరిశ్రమల విషయంలో పెట్టుబడి పరిమితిని రూ .10 కోట్ల నుంచి రూ .20 కోట్లకు పెంచింది. టర్నోవర్  రూ .5 కోట్ల నుంచి రూ .100 కోట్లకు ఉండాలని నిర్ణయించింది. పలు ఇండస్ట్రీల ఎక్స్ పర్ట్స్ ను సంప్రదించిన తరువాత రూ .50 కోట్ల పెట్టుబడికి  టర్న్ ఓవర్ కోసం రూ .250 కోట్ల వరకు పరిమితులను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

4) పరిశ్రమ ప్రతినిధులు చేసిన సూచనలను అంగీకరిస్తూ, సూక్ష్మ, చిన్న లేదా మధ్యతరహా పరిశ్రమలకు టర్న్ ఓవర్ పరిమితులు ఎగుమతి ద్వారా వచ్చే లాభాల్లో కలిగి ఉండవని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

5) ఎంఎస్‌ఎంఈని కింద క్లబ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్, సర్వీస్ లను యాడ్ చేసింది.

6) ఎంఎస్‌ఎంఈలపై ఆర్బీఐ నియమించిన యుకే సిన్హా నేతృత్వంలోని కమిటీ ఎంఎస్‌ఎంఈలు ఆస్తుల్ని నష్టపోతే ఆస్తుల్ని, నిధుల్ని నష్టపోతే  నిధుల్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.   ఆ సిఫారసులను స్వీకరించిన కేంద్ర క్యాబినెట్  25 లక్షల మంది ఎంఎస్‌ఎంఈల పునర్నిర్మాణానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ పథకం కింద ఎం ఎస్ ఎం ఈ గరిష్టంగా రూ .75 లక్షలు లేదా వారి మొత్తం పెట్టుబడిలో 15 శాతం రుణం పొందవచ్చు. ఇది కరోనా కష్ట కాలంలో ఉన్న 2 లక్షల ఎంఎస్‌ఎంఈ  యూనిట్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.

7) ఎంఎస్‌ఎంఈలు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ  మొత్తం రూ .50 వేల కోట్ల నిధిని ప్రకటించింది. ఎంఎస్ఎంఈలలో 15 శాతం వరకు ఈక్విటీని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఈ నిధిని వినియోగిస్తుంది