మణిపూర్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వస్తోంది.మొదటి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. రౌండ్ రౌండ్ కు కమలం పార్టీ మెజార్టీ సీట్లలో లీడ్ లో దూసుకుపోతోంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏమాత్రం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా..బీజేపీ 24 సీట్లలో మెజార్టీ సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది.కాంగ్రెస్ కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. ఇక జేడీయూ కేవలం 6 స్థానాలు, ఇతరులు 8 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.
