కాసేపట్లో పెళ్లి.. అందరికీ షాకిచ్చింది

కాసేపట్లో పెళ్లి.. అందరికీ షాకిచ్చింది

అంగరంగ వైభవంగా జరుగుతోంది అక్కడి పెళ్లి తంతు. బంధువులు, స్నేహితులతో హడావిడిగా ఉంది. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో పెళ్లికూతురు అందరికీ పెద్ద షాకిచ్చింది. ఇంతకీ అక్కడేం జరిగిందంటారా? బ్యాక్​గ్రౌండ్​లో పాట వస్తుంటే పెళ్లికూతుర్ని మండపం పైకి తీసుకురావాలి. కుందనపు బొమ్మలా తయారైన పెళ్లికూతురు రెడీగా ఉంది. అనుకున్నట్టుగానే వెనకాల పాట వస్తోంది. కానీ, పెళ్లి కూతురు మాత్రం ‘‘నేను మండపం ఎక్కను’’ అని మొండిపట్టు పట్టింది. ‘ఏంటి? ఏమైంది?’ అని బంధువులంతా కంగారుపడుతూ అడిగారు. దానికి ఆమె ‘నేను మండపం దగ్గరికి వెళ్లేటప్పుడు పెళ్లికూతురి పాట పెట్టాలి. వేరే పాట ఎందుకు పెట్టారు? పాట మార్చే వరకూ నేను రాను’ అని బుంగమూతి పెట్టింది. ఆ తతంగమంతా వీడియోలో రికార్డ్​ అయ్యింది. ఆ తర్వాత సోషల్ మీడియాకి ఎక్కింది.