నేటి నుంచి అసెంబ్లీలో పద్దులపై చర్చ

నేటి నుంచి అసెంబ్లీలో పద్దులపై చర్చ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో గురువారం నుంచి బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు క్వశ్చర్ అవర్​తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత పద్దులపై చర్చ ప్రారంభిస్తారు. సోషల్, మైనార్టీ, ట్రైబల్, ఉమెన్ అండ్​ చైల్డ్, బీసీ వెల్ఫేర్, సివిల్​ సప్లై, ఆర్ అండ్ బీ, స్టేట్ లెజిస్లేచర్, ఎక్సైజ్, స్పోర్ట్స్​ – యూత్ సర్వీసెస్, టూరిజం పద్దులపై చర్చిస్తారు. అనంతరం ఆయా శాఖల మంత్రులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. గురువారం మండలికి సెలవు ప్రకటించారు. సాధారణ బడ్జెట్​పై బుధవారమే మండలిలో చర్చించారు. దానికి మంత్రి హరీశ్​రావు సమాధానమిచ్చేందుకు గురువారం మండలిని సమావేశపరుస్తున్నారు. ఈ క్రమంలో మండలిలో క్వశ్చర్ అవర్ రద్దు చేస్తూ బులెటిన్ జారీ చేశారు.