పేదల జీవనాధారాన్ని కేంద్రం లాగేసుకుంది: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్

పేదల జీవనాధారాన్ని కేంద్రం లాగేసుకుంది:  కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేద ప్రజల జీవనాధారమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. అయితే, అహంకారపూరితమైన మోదీ ప్రభుత్వం దానిని లాగేసుకుందని విమర్శించారు. ఉపాధి హామీ అనేది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కీమ్ మాత్రమే కాదని, కోట్ల మంది కార్మికుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పారు. 

ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ లో మల్లికార్జున ఖర్గే ఒక పోస్ట్ పెట్టారు. “ఇరవై ఏండ్ల క్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపుర్ జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీఏను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం దాదాపు రూ.10.63 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దీంతో కార్మికులు రెండు పూటలా తినడానికి, వారి పిల్లలకు చదువుకు, హెల్త్ కేర్​కు, వలసలను నివారించడానికి సహాయపడ్డాయి. 

ఈ స్కీమ్  ద్వారా మొత్తం 4,879 కోట్ల పనిదినాల ఉపాధి లభించింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10.10 కోట్ల ఆస్తులు సృష్టించబడ్డాయి. పంచాయతీలు మొత్తం వ్యయంలో దాదాపు 40 శాతాన్ని ఉపాధి హామీపైనే ఖర్చు చేస్తున్నాయి. ఈ స్కీమ్ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రాణం పోసింది. అయితే,  మోదీ ప్రభుత్వం నేడు  కోట్ల మంది కార్మికుల జీవనాధారాన్ని లాగేసుకుంది” అని విమర్శించారు.