ఆగస్ట్ 5న కాక్రోచ్ జనతా పార్టీ భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ఆగస్ట్ 5న కాక్రోచ్ జనతా పార్టీ భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ఛత్రపతి శంభాజీనగర్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కోర్ కమిటీ ఆగస్టు 5న ఛత్రపతి శంభాజీనగర్‌‌‌‌‌‌‌లో భేటీ కానుంది. పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే ఇంట్లో జరగనున్న ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం. జంతర్ మంతర్ నిరసనల అనంతరం కార్యకర్తలు, వాలంటీర్లు తమ కుటుంబాలతో సమయం గడపాలని పార్టీ నాయకత్వం సూచించింది. అదే సమయంలో విద్యార్థులు, వాలంటీర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించాలని కోర్ కమిటీ సభ్యులను కోరింది. ఈ సలహాలు, సూచనలపై చర్చించి పార్టీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.