గంగవరం పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కంటైనర్ టెర్మినల్ వచ్చే నెలలో పనిచేస్తుంది

గంగవరం పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కంటైనర్ టెర్మినల్ వచ్చే నెలలో పనిచేస్తుంది

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్​)కు ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో ఏకీకృత నికర లాభం 16.86 శాతం తగ్గి రూ.1,091.56 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ. 1,312.9 కోట్లు సంపాదించింది. మొత్తం ఆదాయం  రూ. 5,073 కోట్ల నుంచి రూ. 5,099.25 కోట్లకు పెరిగింది. కంపెనీ మొత్తం ఖర్చులు కూడా రూ.3,660.28 కోట్ల నుంచి రూ.4,174.24 కోట్లకు పెరిగాయి.ఈ క్వార్టర్లో​ కార్గో 91 ఎంఎంటీ (మిలియన్ మెట్రిక్ టన్నులు)ల సరుకును రవాణా  చేసినట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే అదానీ పోర్ట్స్  గాడోట్ గ్రూప్ కన్సార్టియం (70:30 భాగస్వామ్యం) హైఫా పోర్ట్ కంపెనీని కొనుగోలు చేయడానికి 1.13 బిలియన్ డాలర్లకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల కృష్ణపట్నం ఓడరేవులో లిక్విడ్ కార్గో రవాణాపై ఎఫెక్ట్​ ఉందని అదానీ పోర్ట్స్‌‌​ తెలిపింది. గంగవరం పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కంటైనర్ టెర్మినల్ వచ్చే నెలలో పనిచేస్తుందని, ధామ్రాలో 5 ఎంఎంటీ ఎల్​ఎన్​జీ టెర్మినల్ డిసెంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని తెలిపింది. 4 ప్రదేశాలలో, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెండు అగ్రి కంటైనర్ టెర్మినల్స్‌‌లో 4.5 మిలియన్ చదరపు అడుగుల కెపాసిటీతో గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించింది.