తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపు. కొత్త తరం రాజకీయం దూసుకొచ్చేసింది. సరికొత్త రాజకీయం మొదలైంది ద్రవిడ గడ్డపై. జనరేషన్ జెడ్.. 18 నుంచి 35 ఏళ్ల యువత ఆలోచనలకు విజయ్ పార్టీ గెలుపు ఓ నిదర్శనంగా మారింది. ఇప్పుడు విజయ్ అలా కాదు.. పార్టీతో ద్రవిడం ఉన్నా.. ఆయన క్రిస్టియన్.. జనరేషన్ జెడ్ విజయానికి ఇది ఓ మలుపుగా మార్చారు.
విజయ్ పార్టీ గెలుపు అనేది ఈ తరం యువత ఆలోచనలు.. జనరేషన్ జెడ్ రాజకీయాలకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇప్పుడు తమిళనాడు రాజకీయం పూర్తిగా మారిపోయింది.. 70 ఏళ్లు.. రెండు తరాల సంప్రదాయ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడింది. ద్రవిడ గడ్డపై.. ద్రవిడ రాజకీయంలో మార్పు కనిపించింది.
18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉన్న యువత.. ఉద్యోగులు, వ్యాపారుల ఆలోచన కొత్త రాజకీయం వైపు చూస్తున్నారు.. ఆలోచిస్తున్నారు అనటానికే ఈ ఫలితాలే నిదర్శనం. అందుకే విజయ్ టీవీకే పార్టీకి బ్రహ్మరథం పట్టారు.
చెన్నై సిటీ పరిధిలో 16 నియోజకవర్గాలు ఉంటే.. 16 నియోజకవర్గాల్లోనూ విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉండటం ఊహించని పరిణామం. చెన్నై సిటీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ విజయ్ పార్టీ భారీగా ఓట్లు రాబట్టుకున్నది. ముఖ్యంగా యువత విజయ్ పార్టీ వైపు మొగ్గుచూపారు అనటానికి.. టీవీకే పార్టీకి వచ్చిన ఓట్లే నిదర్శనం.
తమిళనాడులో ఇప్పటికే ద్రవిడ పార్టీలదే పైచేయి.. డీఎంకే అయినా.. అన్నా డీఎంకే అయినా.. ద్రవిడ సిద్ధాంతాలతోనే నడిచాయి. గతంలో ఎంజీఆర్ పార్టీ పెట్టినా.. ఆయన డీఎంకే నుంచి చీలి.. ద్రవిడ సిద్దాంత భావజాలంలోనే పార్టీ పెట్టారు. పార్టీలు వేరయినా తమిళనాడు రాజకీయం అంతా ద్రవిత సిద్ధాంతం చుట్టూనే తిరుగుతూ వస్తుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా విజయ్ పార్టీ గెలుపు అనేది.. సరికొత్త రాజకీయంగానే చెప్పొచ్చు.
డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే ఇలా ద్రవిడ సిద్ధాంతాలతో రాజకీయం చేశాయి. అందుకే కాంగ్రెస్, బీజేపీ తన మనుగుడ సాగించలేకపోయాయి.. కేవలం పొత్తులతోనే నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు విజయ్ జనరేషన్ జెడ్ కు నవ నాయకత్వంగా మారారు.. వాళ్లకు అలా కనిపించారు.
మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ అయినా.. నేపాల్ అయినా జనరేషన్ జెడ్ సాధించిన విజయాలే.. ఇప్పుడు తమిళనాడు..
