స్థానిక సంస్థలకు రూ.283 కోట్ల నిధులు రిలీజ్

స్థానిక సంస్థలకు  రూ.283 కోట్ల నిధులు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.283.65  కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ నిధులు గ్రామ  పంచాయ తీలు, మండల, జిల్లా పరిషత్ లకు అందాయి. ఇందులో  గ్రామ పంచాయతీలకు రూ. 241.11 కోట్లు, మండల పరిషత్ లకు రూ. 28.36 కోట్లు, జిల్లా పరిషత్ లకు రూ.14.18 కోట్లు రిలీజ్​అయ్యాయి. కాగా, గ్రామ పంచా యతీల్లో గత ఐదేండ్ల నుంచి పెండింగ్ బకాయి లు ఉండగా.. ఈ నిధులతో కొన్ని బిల్స్ క్లియర్ అయినట్టు అధికారులు చెప్తున్నారు.

 మిగతా నిధులను దశల వారీగా ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియగా.. అప్పటి నుంచి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. 6 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఎంపీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. త్వరలో ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.