గోల్కొండ కోటలోని జగదాంబికా హుండీ ఆదాయం రూ. 1.04 లక్షలు

 గోల్కొండ కోటలోని జగదాంబికా హుండీ ఆదాయం రూ. 1.04 లక్షలు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) అమ్మవారి హుండీ లెక్కింపు బుధవారం ఆలయ కమిటీ చైర్మన్ కె. చంటిబాబు ఆధ్వర్యంలో జరిగింది. దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీనివాస్ పర్యవేక్షణలో కార్యనిర్వహణాధికారి వసంత నేతృత్వంలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం 1,04,595 రూపాయల ఆదాయం వచ్చినట్లు చైర్మన్ వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

 తాండూర్: వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన తాండూరు భద్రప్ప గుడి హుండీ ఆదాయాన్ని కూడా ఆలయ కమిటీ అధ్యక్షులు మేడి మహేశ్ కుమార్, ఎండోమెంట్ అధికారి శేఖర్ గౌడ్ సమక్షంలో బుధవారం లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం 1,22,736 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా నిర్వహించే జాతర ఉత్సవాలను ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.