భారత్​ బయోటెక్​కు​ డీసీజీఐ అనుమతి

భారత్​ బయోటెక్​కు​ డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ: భార‌‌త్ బ‌‌యోటిక్ కంపెనీ వ్యాక్సినేషన్​లో మ‌‌రో ముందడుగు వేసింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్​తీసుకున్నవారికి బూస్టర్​డోస్​గా ఇంట్రానాసల్(ముక్కు ద్వారా వేసే చుక్కల మందు) టీకా వేసేందుకు ఫేజ్​3 క్లినిక‌‌ల్ ట్రయల్స్​నిర్వహణకు డ్రగ్స్ కంట్రోల‌‌ర్ జ‌‌న‌‌ర‌‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఫేజ్​2 క్లినికల్​ట్రయల్స్​కు ఆగస్టులోనే అప్రూవల్​వచ్చింది. ఫేజ్​3 పరీక్షలకు భారత్ బయోటెక్ డిసెంబర్​లో అనుమతి కోరగా.. డీసీజీఐ జనవరి 27న  పర్మిషన్​ఇచ్చింది. ఫేజ్ 3 ట్రయల్స్​లో భాగంగా ఇంట్రానాసల్ ఇమ్యునోజెనిసిటీ, రక్షణను కొవాగ్జిన్‌‌తో కూడా పోల్చి స్టడీ చేయనున్నారు. ముక్కు ద్వారా వేసే చుక్కల మందు టీకా అందుబాటులోకి వస్తే సూదులు, సిరంజిల వాడకం తగ్గి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొత్తం ఖర్చుపై ప్రభావం ఉంటుందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు.