బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని (20) మృతిచెందిన ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలోని తన ఇంట్లో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం ... మృతురాలిని ప్రభుధ్యగా గుర్తించారు. ఆమె గొంతు,  చేతులపై కోసిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.  బుధవారం ( మే 15) రాత్రి ఈఘటన జరిగిందని... మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాష్​ రూమ్​ లో ప్రభుధ్య విగత జీవిగా గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతురాలి తల్లి సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.  తన కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.  తన కుమర్తు ఫోన్​ కనిపించక పోవడం.. ఇంటి వెనుక తలుపులు తెరచి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తుంది.  స్థానిక సమస్యలపై పోరాడుతూ రాజకీయ నాయకులను వ్యవస్థల గురించి ప్రశ్నించానని మృతురాలి తల్లి సౌమ్య తెలిపింది.  ఇంకా తాను ఆపదలో ఉన్న అనేక పిల్లలను రక్షించానంటూ.. తన కుమార్తె ప్రభుధ్యలో ఆత్మగౌరవం, నైతికత, ధైర్యం గురించి చెబుతూ పెంచానన్నారు.  

బుధవారం ( మే 15) కాలేజీ అయిన తరువాత ఇంటికి వచ్చిన కుమార్తె ఇలా మరణించడం పట్ల ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.  యువతి మృతదేహం మెడ, చేతులపై గాయాలతో ఉన్నట్లు సౌత్ డీసీపీ ఎస్.లోకేశ్ జగల్‌సర్ తెలిపారు.కేసు విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.  పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.