‘కంటి వెలుగు’  మెయింటనెన్స్​ పైసలు పక్కదారి

‘కంటి వెలుగు’  మెయింటనెన్స్​ పైసలు పక్కదారి

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ  పరిధిలో రెండో విడత  ‘కంటి వెలుగు’  మెయింటనెన్స్​ ఫండ్స్​ పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ  ఓ కాంట్రాక్ట్​ ఆఫ్తాల్మిక్​​ డాక్టర్​ గురువారం సోషల్​ మీడియాలో వీడియోను షేర్​ చేశాడు.  డిప్యూటీ  డీఎంహెచ్​వోపై వీడియోలో ఆరోపణలు చేయడం హాట్​ టాపిక్​ గా మారింది.  

కంటివెలుగుకు 25  టీములు పనిచేస్తున్నాయని,  వీరికి భోజనాలు, టెంట్​  ఖర్చు రూ. 35 లక్షలు కాగా, 90 శాతం ఖర్చును  లోకల్​ లీడర్లపై వేసి ..మిగిలిన సొమ్మును స్వాహా చేశారని ఆ వీడియోలో వెంకన్న ఆరోపించారు.  ఈ విషయమై లోకల్​ బాడీస్​ అదనపు కలెక్టర్​  కుష్బూ గుప్తా మిర్యాలగూడ  మండలం  తడకమళ్ల గ్రామంలో ‘కంటి వెలుగు’ క్యాంప్​ను విజిట్ చేసి విచారణ చేపట్టారు.