ప్రపంచంలో చివరి రెండు రైనోలు ఇవే

ప్రపంచంలో చివరి రెండు రైనోలు ఇవే

ఇవి నార్తర్న్ వైట్ రైనో జాతి ఖడ్గమృగాలు. ఒకప్పుడు ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున ఉండేవి. ఇప్పుడు రెండేమిగిలాయి. నాజిన్, ఫటూ అనే ఈ రెండూ ఆడ రైనోలే. వీటికి వయసైపోతోంది. అందుకే.. ఇవి చనిపోయేలోగా వీటికి సంతానం కలిగేలా చేసి, ఈ జాతిని నిలబెట్టాలని కెన్యాలోని ఓల్ పెజెటా కన్సర్ వెన్సీజూ సైంటిస్టులు ప్రయత్నిస్తు న్నారు. ఇందుకోసం వీటి నుంచి అండాలు సేకరించారు . మగ నార్తర్న్ వైట్రైనోలు బతికుండగా, వాటి నుంచి సేకరించి , భద్రపర్చిన వీర్యం సాయంతో ఆ అండాలను ఫెర్టిలైజ్ చేసి ఇప్పటికే రెండు పిండాలు సృష్టించారు. ఇటీవల మరో ఎంబ్రియోను సిద్ధం చేశారు. కనీసం 5 ఎంబ్రియోలను ఆడ సదర్న్ వైట్ రైనోల గర్భంలోకి ప్రవేశపెట్టి నార్తర్న్ వైట్ రైనో పిల్లలను పుట్టించి ,ఆ జాతిని కాపాడాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి