30 ఏండ్లు దాటినోళ్లందరికీ బీపీ, షుగర్ చెక్ చేయాలి

30 ఏండ్లు దాటినోళ్లందరికీ బీపీ, షుగర్ చెక్ చేయాలి

హైదరాబాద్ : ఈ నెల చివరికల్లా నాన్‌‌ కమ్యునికెబుల్ డిసీజెస్ (ఎన్​సీడీ) సర్వేను కంప్లీట్ చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి హరీశ్‌‌రావు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు, సిబ్బందితో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఎన్‌‌సీడీ సర్వే వివరాలడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సర్వే పూర్తవగా, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈనెల చివరి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. సర్వేలో 30 ఏండ్లు దాటినోళ్లందరికీ బీపీ, షుగర్ చెక్ చేయాలన్నారు. ఎవరికైనా బీపీ, షుగర్ ఉన్నట్టు తేలితే వారికి మందులందజేయాలని ఆదేశించారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను సరఫరా చేస్తోందని, మందుల్లేవనే మాట వినిపియొద్దన్నారు. ఆరోగ్య శాఖ విభాగాల ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని, డీఎంహెచ్‌‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌‌వోలు, పీవోలు ఫీల్డ్‌‌ విజిట్స్‌‌ చేయాలని సూచించారు. పనితీరు బాగుంటే గుర్తింపు దక్కుతుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌‌కుమార్‌‌‌‌, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం : -

కర్ణాటక బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా


మైనర్ బాలిక కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం