గాల్లో ఎగురుతున్న విమానంలో పాము.. ఆ తర్వాత ఏం జరిగింది

గాల్లో ఎగురుతున్న విమానంలో పాము.. ఆ తర్వాత ఏం జరిగింది

హైజాకర్‌లు విమానాల్ని హైజాగ్ చేసి, స్వాధీనం చేసుకున్నారన్న వార్తలను ఎన్నో చూసి, విని ఉంటాం. అలాంటిది ఓ జంతువు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? ఇటీవల ఒక విమానంలో అలాంటి ఘటనే జరిగింది. కానీ విమానంలోకి ప్రవేశించింది జంతువు కాదు. ఓ విషపూరితమైన పాము. ఇది పైలట్ ముందున్న కాక్‌పిట్ లోపల కనిపించింది. అప్పుడు వాళ్లు ఏం చేశారు. ఎలా ఆ పామును భయటికి పంపిచారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పటిలాగే ఓ రోజు దక్షిణాఫ్రికా పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్‌ విమాన ప్రయాణం ప్రారంభించాడు. అంతలోనే కాక్‌పిట్‌లోకి ఆహ్వానింపబడని ఓ అతిథి ప్రవేశించినట్లు అతనికి అర్థమైంది. భయంతో చుట్టూ చూసేసరికి... అది కాక్‌పిట్‌లో ఉన్న విషపూరితమైన కోబ్రా పామును చూశాడు. అతనికి ఆ దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా అనిపించింది. ఆ పాముతో తనకు ఎలా వ్యవహరించాలో అర్థం కాలేదు. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెయిన్ నుంచి ప్రిటోరియాకు వెళ్తున్న ఆ ప్రైవేటు ఫ్లైట్ లో మొత్తం నలుగురు ప్రయాణికులున్నారు. పాము భయంతో అతని శరీరమంతా చెమటలు పడ్డాయి. ఆ తర్వాత కుర్చీ కింద అతనికి ఏదో కదులుతున్నట్లు అనిపించింది. కుర్చీ కిందకి చూసేసరికి మళ్లీ షాక్ అయ్యాడు. 

ఆ పాము తన కుర్చీ కింది భాగానికి చేరడంతో ఇంకా భయపడ్డాడు. ఆ విమానంతో పాటు ప్రయాణీకుల బాధ్యత మొత్తం తనదే అని తెలుసుకున్న ఆ పైలెట్ చాలా చాకచాక్యంగా వ్యవహరించాడు. అసలు విషయాన్ని ప్రయాణికులతో చెప్పి, వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేస్తానని తెలియజేశాడు. అనంతరం విమానాన్ని వెల్ కమ్ సిటీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ పాము కేప్ కోబ్రా జాతికి చెందినట్టుగా అధికారులు గుర్తించగా.. అది కాటు వేస్తే 30నిమిషాల్లోనే మనుషులు చనిపోతారన్న వార్త తెలిసి వారంతా మరింత ఆందోళన చెందారు. తాము ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక ఉపశమనం పొందారు. 

విమానం స్టార్ట్ కావడానికి ముందే పైలెట్ ఫ్లైట్ లోపల అంతా పరిశీలించాడు. కానీ ఆ పాము అప్పుడు అతనికి కనిపించలేదు. ఏదేమైనా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రుఢాల్ప్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. తన ధైర్యాన్ని పొగుడుతూ, అతని శక్తి, సామర్థ్యాలను కొనియాడుతున్నారు.