హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల పరంపర కొనసాగింది. 17,475 పోస్టుల భర్తీకి 22 నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. వీటిలో సగం నోటిఫికేషన్లు ఈ డిసెంబర్ నెలలోనే విడుదలయ్యాయి. రెండు, మూడు నోటిఫికేషన్లు మినహా మిగతావన్నీ చివరి మూడు నెలల్లోనే రావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి నోటిఫికేషన్ గ్రూప్ 1తో మొదలైంది. 503 పోస్టులకు ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇవ్వగా, 3,80,204 మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం మెయిన్స్ పికప్ లిస్టు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ నెలలోనే గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్లు రిలీజయ్యాయి.
నోటిఫికేషన్ పోస్టులు
గ్రూప్ 1- 503, డీఏఓ గ్రేడ్2-53, ఏఈఈ -1540, ఏఈ, జేటీఓ- 837, జేఎల్ -1392, పాలిటెక్నిక్ లెక్చరర్- 247, గ్రూప్ 4- 9,168, గ్రూప్ 2- 783, గ్రూప్ 3 - 1,365
