
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఎడ్యుకేషన్, ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లలో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ.. ఆర్థికశాఖ స్పెషల్సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇందులో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. కాలేజీయేట్ఎడ్యుకేషన్, కాలేజీయేట్ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ఎడ్యుకేషన్పరిధిలోని లెక్చరర్ పోస్టులతో పాటు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు కూడా అనుమతి లభించింది. అమోదం తెలిపిన వాటిలో2,130 ఖాళీలు లెక్చరర్ పోస్టులు కాగా, 95 లైబ్రేరియన్ పోస్టులు, 157 ఫిజికల్ డైరెక్టర్, 5 మాట్రన్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ఆర్కైవ్స్లో 14 పోస్టులున్నాయి. ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన పోస్టులతో ఇప్పటి వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రభుత్వం అనుమతించిన పోస్టుల సంఖ్య 49,428కు చేరింది.