క్యాబ్ కంపెనీల అడ్డగోలు ఛార్జీలు!

క్యాబ్ కంపెనీల అడ్డగోలు ఛార్జీలు!

 

  • కేంద్రం చట్టం తెచ్చినా అమలు చేయని రాష్ట్రం
  •     ఏడాదిగా అగ్రిగేటర్​ గైడ్​లైన్స్ పెండింగ్​లో పెట్టిన్రు
  •     ఓలా, ఉబర్‌‌‌‌ లాంటి కంపెనీలకు లాభం చేసేలా సర్కార్ తీరు
  •     అమల్లోకి వస్తే ప్యాసింజర్లు, క్యాబ్‌‌‌‌ డ్రైవర్లకు ఎంతో మేలు
  •     వివిధ రకాల పేర్లతో అడ్డగోలు చార్జీలు ఉండవు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: క్యాబ్​ కంపెనీలు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయకుండా కంట్రోల్ చేసే చట్టాన్ని రాష్ట్ర సర్కార్ అమలు చేయడం లేదు. దీంతో ప్రయాణికుల నుంచి అవి ఇష్టమొచ్చినట్టు రైడ్ చార్జీలు దండుకుంటున్నాయి. అలాగే క్యాబ్ డ్రైవర్ల (వెహికల్ ఓనర్లు) నుంచి కూడా ఎక్కువ కమీషన్ తీసుకుంటున్నాయి. వినియోగదారులు, డ్రైవర్లు ఇలా దోపిడీకి గురికాకుండా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ అగ్రిగేటర్ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను తీసుకొచ్చింది. దాదాపు అన్ని రాష్ట్రా వీటిని అమలు చేస్తుండగా మన రాష్ట్ర సర్కార్​మాత్రం పక్కన పెట్టింది. ఏడాదిగా ఈ గైడ్​లైన్స్​పెండింగ్​లో పెట్టి ఓలా.. ఉబర్ లాంటి అగ్రిగేటర్​ కంపెనీలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నది. గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం క్యాబ్ కంపెనీలు లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో సేవలందిస్తున్న కంపెనీల్లో ఒక్క దానికీ లైసెన్స్ లేదు. గైడ్​లైన్స్ అమలు చేస్తే రకరకాల పేర్లతో అడ్డగోలుగా చార్జీలు వసూలు చేసే వీలుండదు. డ్రైవర్ల నుంచి అధిక శాతం కమీషన్ తీసుకోవడం కుదరదు. ఈ రూల్స్ పాటించకుంటే కంపెనీల లైసెన్స్ రద్దు అవుతుంది.

అగ్రిగేటర్ల ఇష్టారాజ్యం

రాష్ట్ర వ్యాప్తంగా 1.30లక్షల వరకు క్యాబ్‌‌‌‌లు ఉన్నాయి. ఇందులో అధిక శాతం గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లోనే ఉన్నాయి. అయితే క్యాబ్‌‌‌‌ అగ్రిగేటర్ మార్కెట్‌‌‌‌ రెగ్యులేట్‌‌‌‌ చేయడానికి కేంద్రం 2020 నవంబర్‌‌‌‌లో గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ తీసుకొచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసింది. ఈ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు అగ్రిగేటర్‌‌‌‌ అనే పదాన్ని నిర్వచించారు. డిజిటల్‌‌‌‌ ఇంటర్మీడియరీ లేదా రవాణా కోసం ప్యాసింజర్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌ను కనెక్ట్‌‌‌‌ చేయడమేనని డిఫైన్‌‌‌‌ చేశారు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు క్యాబ్‌‌‌‌ అగ్రిగేటర్లకు ఎలాంటి లైసెన్స్‌‌‌‌ లేవని క్యాబ్‌‌‌‌ యూనియన్లు చెబుతున్నాయి. లైసెన్స్‌‌‌‌ లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి కంపెనీస్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ లేదా కోఆపరేటివ్‌‌‌‌ సొసైటీ, ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ యాక్ట్‌‌‌‌ ప్రకారం లైసెన్స్‌‌‌‌ తీసుకోవాలి. కొత్త రూల్స్‌‌‌‌ ప్రకారం అగ్రిగేటర్లకు లైసెన్స్‌‌‌‌ జారీ చేయవచ్చు. కానీ ఏడాది దాటినా ఇప్పటి దాకా గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ముచ్చటే మరిచారు. దీంతో నియంత్రణ లేకపోవంతో అగ్రిగేటర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది.

సక్కగ లేకుంటే లైసెన్స్‌‌‌‌ కట్‌‌‌‌

అగ్రిగేటర్ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ అమలు చేస్తే కంపెనీలు తమ కార్యకలాపాల అనుమతికి తప్పకుండా లైసెన్స్‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అగ్రిగేటర్‌‌‌‌కు లైసెన్సు జారీ చేసేటప్పుడు కేంద్రం జారీ చేసిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుంది. అగ్రిగేటర్ తప్పనిసరిగా లైసెన్స్ మంజూరు చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు తన కార్యకలాపాలను ప్రారంభించాలి. లేకుంటే లైసెన్స్ రద్దు అవుతుంది. లైసెన్స్ లిమిట్‌‌‌‌ ఐదేండ్లపాటు ఉంటుంది. లైసెన్స్ ఫీజు రూ. 5లక్షలుగా నిర్ణయించారు. దాన్ని ఎప్పటికప్పుడు రెన్యూవల్‌‌‌‌ చేయాలి. అగ్రిగేటర్‌‌‌‌ తన నిర్వహణలో ఫెయిలైతే లైసెన్స్‌‌‌‌ రద్దు చేస్తారు. ప్రయాణికుల భద్రత, రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించినా లైసెన్స్‌‌‌‌ క్యాన్సిల్‌‌‌‌ చేస్తారు.

డ్రైవర్​ నుంచి 20% కంటే ఎక్కువ తీసుకోవద్దు

కొత్త రూల్స్‌‌‌‌ ప్రకారం క్యాబ్‌‌‌‌ల్లో బేస్‌‌‌‌ ఫేర్‌‌‌‌ అమలు చేయాల్సి ఉంటుంది. అడ్డగోలుగా రైడ్‌‌‌‌ చార్జీలు తీసుకోవడానికి ఉండదు. రైడర్‌‌‌‌ రైడ్‌‌‌‌ క్యానిల్స్‌‌‌‌ చేస్తే మొత్తం చార్జీలో 10శాతానికి మించి తీసుకోకూడదు. గరిష్టంగా రూ. 100 దాటకూడదు. క్యాబ్‌‌‌‌లకు డిమాండ్ ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు చార్జ్ వసూలు చేయొద్దు. ఇక డ్రైవర్ల నుంచి కంపెనీలు తీసుకునే కమీషన్‌‌‌‌ కూడా తక్కువగా ఉండనుంది. 20శాతం వరకు మాత్రమే కమీషన్‌‌‌‌ తీసుకోవాలి. కానీ ఇప్పుడు 30శాతం వరకు కమీషన్‌‌‌‌ వసూలు చేస్తున్నాయి. వచ్చిన దాంట్లో 80శాతం డ్రైవర్‌‌‌‌కే చెందాలి. డ్రైవర్లకు ఇన్సూరెన్స్‌‌‌‌ కల్పించాలి. ఏటా 5శాతం ఇంక్రిమెంట్లు వేయాలి. ఒక రోజులో 12గంటల కంటే ఎక్కువగా పనిచేయొద్దు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి అగ్రిగేటర్లు 24గంటల కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయాలి. మహిళాభద్రతకు ప్రయారిటీ ఇవ్వాలి. కార్‌‌‌‌ పూలింగ్‌‌‌‌ టైంలో మహిళలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి.

గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ అమలు చేయాలి..

కేంద్రం తీసుకొచ్చిన అగ్రిగేటర్ల  గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌తో అన్ని వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. క్యాబ్‌‌‌‌ డ్రైవర్లు, ప్రయాణికులకు లబ్ధి చేకూరడంతోపాటు సర్కారుకు కూడా ట్యాక్స్‌‌‌‌ రూపంలో ఆదాయం వస్తుంది. ఇష్టమొచ్చినట్లు చార్జీలు వసూలు చేయడం ఉండదు. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, అమలు చేయాలి.
- షేక్‌‌‌‌ సలావుద్దిన్‌,    ఫోర్‌‌‌‌వీలర్స్‌‌‌‌ అసోసియేషన్ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌