Spirit: ప్రభాస్‍ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!

Spirit: ప్రభాస్‍ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రెజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో సలార్ పార్ట్ 2(Salaar 2), కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD), స్పిరిట్(Spirit) సినిమాలు ఉన్నాయి. అయితే..ఈ మూడు సినిమాల్లో స్పిరిట్ కోసమే ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ (Sandeep reddy vanga) దర్శకుడు అవడం.

ఆయన రీసెంట్ మూవీ యానిమల్ మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే..స్పిరిట్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్‍తో తెరకెక్కించే ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది.ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అయితే,ఈ సినిమాలో కథకు తగ్గట్టుగా ఇద్దరు హీరోయిన్లను డైరెక్టర్ సందీప్ ఈ సినిమాలో దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తెలుగు, తమిళం, బాలీవుడ్ లో మంచి క్రేజ్ మీదున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది.అలాగే మరో హీరోయిన్‌‌గా లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది.

అంతేకాదు  మహానటి కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారట మేకర్స్. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. యానిమల్(Animal) సక్సెస్ తో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ ను తెరకెక్కిస్తున్నాడు.